కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మ లేఖపై ప్రధాని ఏం చేస్తారో?: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam Party Logo
కర్నూలు/విజయవాడ: సుప్రీం కోర్టులో భంగపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సిబిఐ తీరును తప్పు పడుతూ లేఖ రాయడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ నేత కెఈ కృష్ణమూర్తి బుధవారం కర్నూలు జిల్లాలో అన్నారు. ఆయన అవినీతిని ప్రోత్సహిస్తారో లేక న్యాయంగా నడుచుకుంటారో చూడాలన్నారు. రాష్ట్రంలోని ముప్పై ఐదు లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెన్యువల్‌ను ఈ నెల 19వ తేదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు ఆ పార్టీకి అద్దె మనుషులుగా వ్యవహరిస్తున్నారని టిడిపి మహిళా నేత అనురాధ విజయవాడలో అన్నారు. రాష్ట్రంలో అవినీతి మాఫియా రాజ్యమేలుతోందని టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు వేరుగా విజయవాడలో ధ్వజమెత్తారు. సమాచార హక్కు కమిషన్ కాంగ్రెసు పునరావాస కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు. నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2జి కుంభకోణం కేసులో పిఎంవో పాత్ర ఉందని, దానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party leader KE Krishna Murthy asked that what will PM Manmohan Singh do about YS Vijayamma letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X