ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాకు అధిష్టానాలు, ఢిల్లీ రిమోట్లు లేవు: కారత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakash Karat
ఖమ్మం: తమకు అధిష్టానాలు, ఢిల్లీ రిమోట్లు లేవని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కాంగ్రెుస పార్టీని ఉద్దేశించి అన్నారు. ఖమ్మంలో ఆయన గురువారం పార్టీ మహాసభలను ప్రారంభించారు. మావోయిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. మావోయిస్టులు ఎవరికి వంత పాడుతున్నారో వారే మావోయిస్టుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ పాలనలో పశ్చిమ బెంగాల్‌లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని, తృణమూల్ కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల అభివృద్ధి జరగదని, విప్లవాలూ ఉద్యమాలూ పుట్టుకొస్తాయని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్‌ను బహిరంగంగా వేలం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం నడిచిన గడ్డ మీద మహాసభలు జరగడం గర్వంగా ఉందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని 11 కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పెద్ద యెత్తున ఉద్యమాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రధాన పార్టీలు ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని, ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ప్రభుత్వం పెద్ద యెత్తున ప్రజలపై పన్నుల భారం వేయడానికి సమాయత్తమవుతోందని, దీనిపై ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి ఈ నెల 15వ తేదీన హైదరాబాదులో సమావేశమవుతామని ఆయన చెప్పారు.

English summary
CPM general secretary Prakash Karat said that his party has no high commands and Delhi remotes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X