ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర విభజనపై టిడిపి నిలువునా చీలింది: రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
ఖమ్మం: రాష్ట్ర విభజన అంశంపై తెలుగుదేశం పార్టీ నిలువునా చీలిపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై మహాసభల్లో చర్చకు తావు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, బిజెపిలను ఓడించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రధాన రాజకీయ పక్షాలను తాము ప్రజా సమస్యల వైపు నడిపిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొని ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

కాగా, విరాళాల వసూలు విషయంలో శానససభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణపై రాఘవులుతో పాటు సిపిఐ కార్యదర్శి కె. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సిపిఎం మహాసభల కోసం 25 కోట్ల రూపాయలు వసూలు చేసిందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తమకు 20 కోట్ల రూపాయలు తమకు ఇచ్చిన మిగిలిన డబ్బంతా మల్లు భట్టి విక్రమార్క తీసుకుని వెళ్లవచ్చునని, తాము వసూలు చేసిన డబ్బును మధ్యవర్తి వద్ద పెడుతామని ఆయన అన్నారు. తాము వసూలు చేసే విరాళాలు కాంగ్రెసు పార్టీని గద్దె దించడానికే వాడుతామని నారాయణ అన్నారు.

English summary
CPM secretary BV Raghavulu said that there is a split in TDP on Anddhrapradesh state division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X