వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిటీలపై మరో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్సీల అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yadava Reddy
హైదరాబాద్: మండలి కమిటీల నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే మండలి సభ్యుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బుధవారం ఎథిక్స్ కమిటీకి, అంచనాల కమిటికీ తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కమిటీల నియామకం పట్ల తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కమిటీలో తెలంగాణవారికి చోటు దక్కకపోవడంపై కునుకుల జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ సభ్యత్వ పదవికి ఆయన రాజీనామా చేయనన్నట్లు చెప్పారు. గతంలో మండలి చైర్మన్‌లుగా పని చేసిన వారిని సభ్యులుగా నియమించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ చైర్మన్‌ను మార్చి మండలి విప్‌లను ఎందుకు మార్చలేదన్నారు. కమిటీల ఏర్పాటు వారిదే అయినప్పటికీ సమతుల్యత పాటించక పోవడం సరికాదన్నారు. సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. కమిటీ వేసే ముందు విప్ తమను ఎందుకు సంప్రదించలేదన్నారు.

హక్కుల కమిటీకి రాజీనామా చేయబోతున్నట్లు మరో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చెప్పారు. కమిటీలో తెలంగాణకు వివక్ష జరుగుతోందని ఆయన ఆరోపించారు. శాసనమండలి కమిటీల ఏర్పాటులో వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాగా తెలంగాణ ఎమ్మెల్సీల పట్ల, సీనియర్ల పట్ల శాసనమండలి చైర్మన్ చక్రపాణి అవమానకరమైన పద్ధతిలో వ్యవహరించారని ఆమోస్ బుధవారం ఆరోపిస్తూ రాజీనామా వేసిన విషయం తెలిసిందే. సీనియర్లకు కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాము తెలంగాణకు చెందినవాళ్లం కాబట్టే చైర్మన్ పదవుల్లో వేయడం లేదని, సీనియర్లను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Congress senior MLCs Yadava Reddy and Kunukula Janardhan Reddy were expressed unhappy with Legislative Council committees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X