వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ దర్యాప్తు తీరుపై ఐఎఎస్ అధికారుల సమరభేరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

cbi logo
హైదరాబాద్: సిబిఐ దర్యాప్తు తీరుపై సమరభేరీ మోగించేందుకు రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసుల దర్యాప్తు విషయంలో సిబిఐ ఐఎఎస్ అధికారులను వేధిస్తోందని, ఐఎఎస్ అధికారులను బలి పశువులను చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. దాదాపు 60 మంది ఐఎఎస్ అధికారులు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సిబిఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు ఓ వినితపత్రం కూడా సమర్పించారు. తిరిగి ఆదివారం సమావేశమై ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో కూడా వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజు పెన్ డౌన్ సమ్మెకు వారు సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి సిబిఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేయాలనే యోచనలో కూడా వారున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసి తర్వాత ఐఎఎస్ అధికారుల తరఫున మహాపాత్రో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి తెలియకుండా ఐఎఎస్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తీసుకోవచ్చునని, అయితే ఇతరులు తీసుకునే నిర్ణయాలకు తాము ఎలా బాధ్యులం అవుతామని ఆయన అన్నారు. ఇతరులు తీసుకున్న నిర్ణయాలకు ఐఎఎస్ అధికారులను బలపశువులను చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతరులు ఎవరనే విషయం చెప్పడానికి ఆయన నిరాకరించారు. వేరేవాళ్లను వదిలేసి సిబిఐ ఐఎఎస్ అధికారులను వేధిస్తోందని ఆయన విమర్శించారు. తాము మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తామని, ముందూ వెనకా చూడకుండా సిబిఐ తమను వేధిస్తోందని ఆయన అన్నారు. ఇతరులు తీసుకునే నిర్ణయాలకు బ్యూరోక్రాట్లను బాధ్యులను చేయడం సరి కాదని ఆయన అన్నారు.

సిబిఐ దర్యాప్తులో ప్రోద్బలాలు పనిచేస్తున్నాయని భావిస్తున్నారా అని అడిగితే తాను ఎలా చెప్పగలనని, ప్రభుత్వ సేవకుడిగా తాను ఇంతకు మించి చెప్పలేనని ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వంలో సమర్థత, పారదర్శకత ఉండాలని ఆయన అన్నారు. స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం తమకు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ఐఎఎస్‌ల పరిధిని,

అధికారాలను సిబిఐ తెలుసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు అంటున్నారు. ఐఎఎస్ అధికారులు అజయ్ మిశ్రా, రమాకాంత్ రెడ్డి వంటివారిని సిబిఐ ప్రశ్నించడం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి వంటి ఐఎఎస్ అధికారులను అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు తీవ్రమైన కలవరానికి గురైనట్లు కనిపిస్తున్నారు.

English summary
It seems that IAS officers are making ground to fight against CBI, which is probing high profile cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X