వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ విచారణ: ఐఏఎస్‌లలో హడల్, సిఎంతో సమావేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: ఎమ్మార్ వంటి కేసుల్లో ఐఏఎస్ అధికారుల అరెస్టుల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్‌లు పలువురు శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సుమారు పదిహేను మంది అధికారులు దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రవీణ్ ప్రకాశ్, వసుధా మిశ్రా, శ్యామ్యూల్, రమేష్ కుమార్, రేమండ్ పీటర్, అజయ్ మిశ్రా, వెంకటేశ్వర రావు తదితరులు హాజరయ్యారు. పలువురు ఐఏఎస్‌లు ఇప్పటికే సిబిఐ తీరుపై మండిపడుతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట శ్రీలక్ష్మి తదితరుల ఐఏఎస్ అధికారుల అరెస్టును అంత సీరియస్‌గా తీసుకోనప్పటికీ వరుసగా అధికారులనే సిబిఐ అరెస్టు చేయడాన్ని వారు తప్పు పడుతున్నట్లుగా సమాచారం. విచారణ పేరుతో కేవలం అధికారులనే గంటల తరబడి విచారించడాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవాలని వారు నిర్ణయించుకున్నారు.

సాయంత్రం సిఎంను కలిసి ఈ విషయంపై ఆయనతో చర్చించనున్నారు. శ్రీలక్ష్మి, బిపి ఆచార్య ఇలా వరుసగా ఐఏఎస్‌లనే లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు సిఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని సమాచారం. విచారణ పేరుతో ఐఏఎస్‌లనే ప్రశ్నించడం ద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు చెప్పనున్నారని తెలుస్తోంది. అయితే ఐఏఎస్ అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సిబిఐ దర్యాఫ్తు ఐఏఎస్ అధికారుల్లో హడల్ పుట్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
Senior IAS officers met secretely in committee office today. They decided to meet CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X