విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చినజీయర్ వ్యాఖ్యలపై చర్చిస్తా, వివాదాలకు చెక్: సిఆర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానంపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై మతపెద్దలతో చర్చిస్తామని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శుక్రవారం స్పష్టం చేశారు. ఆయన బెజవాడ కనకదుర్గ అమ్మవారి మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీయర్ వ్యాఖ్యలపై మత పెద్దలతో చర్చిస్తానని చెప్పారు. ఇక నుండి పండుగ తేదీలతో ఏడాది ముందుగానే క్యాలెండర్ రూపకల్పన చేస్తామని చెప్పారు. దేవాదాయ వివాదాల్లో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇక నుండి దేవాలయాల అభివృద్ధిపై నిత్యం సమీక్షలు జరుపుతానని చెప్పారు. ఇందుకోసం ఓ కమిటీని వేయనున్నట్లు చెప్పారు. వివాదాస్పదమైన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతమైన భూముల స్వాధీనానికి అధికారులతో సమీక్ష చేస్తానని చెప్పారు. కాగా సి.రామచంద్రయ్యతో పాటు స్వామి జయేంధ్ర సరస్వతీ వారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఇటీవల చినజీయర్ స్వామి టిటిడిపై మండిపడుతున్న విషయం తెలిసిందే. టిటిడి వైఖరి నిరసిస్తూ ఆయన గురువారం తిరుపతి నుండి తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు.

English summary
Minister C Ramachandraiah responded about Chinna Jeeyar Swamy comments on TTD. He said that he will solve all the issues of TTD and other temples.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X