హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాఘవులే మళ్లీ సిపిఎం కార్యదర్శి, ఐదోసారి

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి బివి రాఘవులే ఎన్నికయ్యారు. ఖమ్మంలో జరిగిన పార్టీ 23వ మహాసభల్లో పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవంగా రాఘవులును ఎన్నికున్నారు. రాఘవులు ఎన్నిక విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. కార్యదర్శి పదవికి మరో ఇద్దరు పోటీ పడినప్పటికీ పార్టీ ఎదుర్కుంటున్న సమస్యల దృష్ట్యా తిరిగి రాఘవులునే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, తదితరుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. 2014 సాధారణ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాలపైనా, పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా గట్టి పట్టు ఉన్న రాఘవులును కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో మహాసభ ఆ నిర్ణయం తీసుకుంది.

నల్లగొండలో 1997లో జరిగిన 19వ రాష్ట్ర మహాసభల్లో రాఘవులు మొదటిసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి వరుసగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లో పార్టీ నుంచి శాసనసభకు ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యాడు. తిరిగి బలపడి పూర్వవైభవం సంతరించుకోవడానికి రాజకీయానుభవం ఉన్న రాఘవులును కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

కమ్యూనిస్టు ఉద్యమాల్లో తాను నిత్య విద్యార్థిని అని బివి రాఘవులు అన్నారు. 2014 ఎన్నికల నాటికి పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతానని ఆయన చెప్పారు. ఉత్సాహంగా పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన చెప్పారు. కలిసొచ్చే రాజకీయాంశాలను వాడుకుని పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

English summary
BV Raghavulu re elected as CPM state secretary, fifth consecutive terms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X