వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న జీయర్ స్వామికి ఎల్వీ సుబ్రహ్మణ్యం కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

LV Sunrahmanyam
తిరుమల: తిరుమల విషయంలో చిన్న జీయర్ స్వామి చేస్తున్న వ్యాఖ్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ అధికారి (ఇవో) ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను 110 తప్పులు చేసినట్లు నిరూపిస్తే తాను చేసిన 200 మంచి పనులు చూపిస్తానని ఆయన అన్నారు. తాను పామరుడ్ని అంటూనే చిన్న జీయర్ స్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలయానికి కళంకం తెచ్చినట్లు నిరూపిస్తే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక వ్యక్తి వ్యవస్థను నియంత్రించాలని అనుకోవడం సరైంది కాదని ఆయన చిన్న జీయర్ స్వామిని ఉద్దేశించి అన్నారు. వేయి కాళ్ల మండపానికి ఏ విధమైన చారిత్రక నేపథ్యం లేదని, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే దాన్ని ఉద్దేశించారని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతకు ఏ విధమైన కళంకం జరగలేదని ఆయన చెప్పారు.

స్వామివారి కైంకర్యం విషయంలో పొరపాట్లు జరగకుండా చూడడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయని ఆయన అన్నారు. దేవాలయానికి మార్పులు చేయడం సాధ్యం కాదు కాబట్టి భక్తులకు సరైన దర్శనం కల్పించలేకపోతున్నామనే ఆవేదన తమలో ఉందని ఆయన అన్నారు. స్వామివారికి ఆగ్రహం వస్తే తానిలా నడవగలనా అని ఆయన అడిగారు. తప్పులు చేస్తే స్వామివారు ఉపేక్షించబోరని, స్వామివారికి ఎది కరెక్టో ఏది కాదో తెలుసునని ఆయన అన్నారు. తాను స్వామివారిని పూజించి తరించడానికి మాత్రమే వచ్చానని, తనకు స్వామివారి శక్తి మీద నమ్మకం లేకపోతే వేరే విషయమని ఆయన అన్నారు.

English summary

 TTD EO LV Sunrahmanyam retaliated Chinna Jeeyar Swami's comments on Tirumala affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X