వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరానికి ఊరట, స్వామి పిటీషన్ కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్రం హోంమంత్రి చిదంబరాన్నినిందితుడిగా చేర్చాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ను ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. దీంతో చిదంబరానికి ఊరట లభించింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఇంతటితో అయిపోలేదని, తాను హైకోర్టుకు వెళ్తానని కోర్టు తీర్పు అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. పిటిషన్‌పై విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి షైనీ నిరాకరించారు. దీంతో యుపిఎ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పాత్రపై సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడానికి ముందు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. పాటియాలా హౌస్ కోర్టులోకి మీడియా ప్రతినిధులను అనుతించలేదు. చిదంబరంపై కోర్టు వెలువరించే తీర్పు కోసం కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు తదితరులు గుమికూడారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ విషయాన్ని కింది కోర్టు మాత్రమే తేలుస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా కోర్టు హాల్లోకి అనుమతించారు.

చట్టానికి ఎవరూ అతీతులు కారని, కోర్టు ముందు చిదంబరం చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందని, చిదంబరానికి వ్యతిరేకంగా తాను అన్ని పత్రాలు సమర్పించానని, దాదాపు 2 వేల పేజీల పత్రాలు సమర్పించానని, న్యాయం జరుగుతుందనే విశ్వాసం తనకు ఉందని ఆయన శనివారం ఉదయం అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర లేదని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు. వ్యక్తిగత కక్షతోనే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారని ఆయన ఆరోపించారు.

English summary
The petition filed by Janata Party President Subramanian Swamy had grabbed eyeballs when he mentioned in his plea that Chidambaram had to be made accused in the 2G spectrum scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X