• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేతలు పాడవడం ప్రజల తప్పే:ఉండవల్లి సంచలన వ్యాఖ్య

By Srinivas
|

Undavalli Arun Kumar
విజయవాడ: రాజకీయ నాయకులు పాడవడానికి కారణం ప్రజలేనని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు పాడవుతున్నారంటే ప్రజలదే తప్పని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారిలో పది శాతమే అవినీతి చేయాలనుకుంటారని, మిగతా వారంతా ప్రజా సేవ కోసమే వస్తారని అన్నారు. అవినీతి, అక్రమాలు చేసే రాజకీయ నాయకులు ఉండకూడదంటే చదువుకున్న వాళ్లు రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చదువుకున్న వాళ్లు రాజకీయాల్లోకి రానంత వరకు ఈ నేతలే రాజకీయాల్లో కొనసాగుతారని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు. రాజకీయ నేతల్లో చాలామంది దొంగలేనన్నారు. కాకుంటే చిన్న దొంగ, పెద్ద దొంగలు ఉంటారన్నారు. అయితే ఇందులో కూడా మంచి వారున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయ నేతల్లాగే ఐఏఎశ్ అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమని అంతకుముందు అన్నారు. ఐఏఎస్‌లు తీసుకునే నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ తప్పు లేదని చెప్పడం అధికారులకు సరికాదన్నారు. కనీస ప్రాథమిక సూత్రాలు కూడా మరిచిపోయి వ్యవహరించిన వారి తీరు చాలా విచారకరమన్నారు. చట్టాలు రాజకీయ నాయకులు చేసినా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.

English summary
Rajahmundry MP Undavalli Arun Kumar blamed public for political leaders courruption. He invited educated people in to politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X