• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమ పాత్ర లేదని అరెస్టైన వారిని చెప్పమనండి: వీరశివా

By Srinivas
|

Veera Siva Reddy
న్యూఢిల్లీ: అక్రమాలలో తమ పాత్ర ఏమాత్రం లేదని ఇప్పటి వరకు అరెస్టైన ఐఏఎస్ అధికారులను చెప్పమనండని కమలాపురం కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి ఆదివారం సవాల్ విసిరారు. ఆయన ఉదయం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమపై ఏ మంత్రి ఎంత ఒత్తిడి తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాత్ర ఏమాత్రం లేదని, మంత్రుల పాత్ర ఉందని అధికారులు ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. సిబిఐ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు మాత్రమే పాటిస్తోందన్నారు. మంత్రులు ఎక్కువ తిన్నారని, తాము తక్కువ తిన్నామని చెప్పడం సరికాదన్నారు. అవినీతికి ఎవరు పాల్పడినా శిక్షించాల్సిందేనన్నారు. తాము చిన్న చేపలమని వారు అంటున్నారని, పెద్ద చేపల కోసం వారు డిమాండ్ చేస్తున్నారని, కానీ తిమింగలాలే ఉన్నాయన్నారు.

ప్రస్తుతం సిబిఐ మూడు కేసులను దర్యాఫ్తు చేస్తోందన్నారు. ఎమ్మార్, ఓఎంసి, జగన్ ఆస్తులు - ఈ మూడు కేసులు దర్యాప్తుల్లో పెద్ద చేపలు మాత్రమే కాదు తిమింగలాలు ఉన్నాయన్నారు. ఐఏఎస్‌ల తీరు అవినీతి అధికారులను రక్షించే విధంగా ఉందన్నారు. కాగా రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమారు, మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తదితరులు ఐఏఎస్‌లపై మండిపడ్డారు.

English summary
MLA Veera Siva Reddy demanded IAS officers to reveal corrupted ministers name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X