• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రివర్గ విస్తరణపై పెరుగుతున్న సీనియర్ల అలకలు

By Pratap
|

Gade Venkat Reddy-R Damodar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టిన మంత్రి వర్గ విస్తరణపై అసమ్మతి సెగ పెరుగుతోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ కాంగ్రెసు శానససభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ శానససభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తూ తనను విస్మరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్నారు. దీంతో సోదరులిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే, గుంటూరు జిల్లాకు చెందిన గాదె వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, గాదె వెంకటరెడ్డి తన అసంతృప్తిని చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. తనకు బంధువైన డిఎల్ రవీంద్రా రెడ్డికి మంత్రి పదవి కల్పించినందున తనకు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతుండడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన సి. రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ అయినప్పటికీ మంత్రి పదవి ఇచ్చి సీనియర్ ఎమ్మెల్సీలకు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస సీనియర్ శాసనసభ్యురాలు సత్యవతి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. రాజీనామా చేయడానికి సిద్ధపడిన ఆమెను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

English summary
Senior MLAs are expressing their dissatisfaction over cabinet expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X