హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలు అంటగట్టకండి: మీడియాకు సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణకు రాజకీయాలు అంటగట్టవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సూచించారు. మంత్రి వర్గ విస్తరణపై మీడియాలో భిన్నమైన కథనాలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. శాఖల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నట్టు చెప్పారు. పాలనాపరమైన వెసులుబాటు కోసమే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేర్పులు చేశామన్నారు. దీనికి రాజకీయాలు అంటగట్టవద్దని విజ్ఞప్తి చేశారు. కొన్ని ఛానళ్లు, పత్రికలు దీనికి రాజకీయ పరమైన ఉద్దేశ్యాలు జోడించాయని అన్నారు. అవన్నీ అవాస్తవాలు, సత్యదూరమని అన్నారు. కేబినెట్ టీం వర్క్‌తో పని చేస్తుందని సిఎం చెప్పారు.

కాగా మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుండి ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను, కోస్తా నుండి కొండ్రు మురళి మోహన్‌లకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల శాఖలలో కోత విధించారు. కన్నా లక్ష్మీ నారాయణకు వ్యవసాయం అదనంగా అప్పగించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.

English summary
CM Kiran Kumar Reddy appealed media that don't create politics with cabinet expansion. He said expand and cabinet changes for only easy ruling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X