• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపి ఎమ్మెల్సీ నర్సా రెడ్డికి సుప్రీంలోనూ చుక్కెదురు

By Srinivas
|
Supreme Court
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు నర్సా రెడ్డికి మంగళవారం సుప్రీం కోర్టులోనూ చుక్కెదురయింది. కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డి గెలిచినట్లు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపి వేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పి)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంపై స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని నర్సా రెడ్డికి కోర్టు సూచించింది. నర్సా రెడ్డి ఎస్ఎల్‌పిని సుప్రీం కోర్టు తోసిపుచ్చడంతో ఈ నెల 9వ తేదిన జరిగే రీకౌంటింగ్‌పైనే అందరి దృష్టి పడింది. కాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నర్సా రెడ్డికి ఇటీవల హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కాంగ్రెసు అభ్యర్థి వెంకట్రామి రెడ్డిపై తెలుగుదేశం అభ్యర్థి నర్సారెడ్డి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే ఆ తర్వాత నర్సా రెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు హైకోర్టు ప్రకటించింది.

అయితే, వెంకట్రామి రెడ్డి ఆ ఎన్నికపై కోర్టుకు ఎక్కారు. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అయితే, కేసును హైకోర్టులోనే పరిష్కరించాలని, అవసరమైతే హైకోర్టు సమక్షంలో ఓట్ల లెక్కింపును తిరిగి చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో కేసుపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చివరకు హైకోర్టు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తిరిగి జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో నర్సా రెడ్డి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిట్లు తేలింది. దీనిపై నర్సా రెడ్డి మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అక్కడా అయనకు చుక్కెదురైంది. అయితే తాను హైకోర్టులోనే తేల్చుకుంటానని ఆయన చెబుతున్నారు. కాగా నర్సా రెడ్డికి చుక్కెదురు కావడం ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీకి కూడా ఎదురు దెబ్బనే.

English summary
Supreme Court gave shock to TDP leader Narsa Reddy. His special leave petition Dismissed SC today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X