హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రసాద్ కుమార్‌తో సబితకు చెక్: రెండో పవర్ సెంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra reddy
హైదరాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే జి.ప్రసాద్ కుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా రంగా రెడ్డి జిల్లాలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లయింది. 2004లో వైయస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జిల్లా కాంగ్రెస్‌లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తిరుగులేదు. అయితే ఇపుడు ప్రసాద్ కుమార్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో రెండో పవర్ సెంటర్ ఏర్పడినట్లయింది. ఇది సబిత వర్గానికి మింగుడుపడని పరిణామమేనంటున్నారు. అందుకే ఆమె మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి కూడా రాలేదని అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణకు ముందు ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కలిశారు. ప్రసాద్ కుమార్ విషయంలో ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా ఏకమై జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలో ప్రసాద్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌తో పాటు మరికొందరు సీనియర్లు సబితతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు మేడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఒక సమయంలో ఆయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేందరినీ కూడగట్టి సబితను ఒంటరిని చేసే యత్నం చేశారు. తరువాత సబిత కొందరిని తనవైపు తిప్పుకోవడంతో పార్టీలో కొంత బలోపేతం అయ్యారు. అయితే.. ప్రసాద్ కుమార్, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి మాత్రం వేరు వర్గంగానే ఉంటున్నారు. సబిత పాల్గొనే కార్యక్రమాలకు కూడా వారంతా దూరంగా ఉంటున్నారు.

తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌లో ఆదివారం జరిగిన మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ప్రసాద్‌కుమార్ దూరంగా ఉన్నారు. ఈ పోలీస్‌స్టేషన్‌ను హోంమంత్రి సబితారెడ్డి ప్రారంభించడంపై ప్రసాద్ అలకవహించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తేదీలు ఖరారు చేసి తరువాత ఆహ్వానం పంపారని ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ నచ్చచెప్పినా కూడా ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ఇప్పుడు ప్రసాద్‌కు మంత్రి పదవి లభించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో సబిత, ప్రసాద్‌ల మధ్య అధిపత్యపు పోరు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

English summary
It may create trouble to home minister Sabitha Indra reddy with the induction of prasad Kumar in the cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X