• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెంచాగిరి చేయను:కత్తిరింపుపై సిఎంమీద డిఎల్ సీరియస్

By Srinivas
|

DL Ravindra Reddy
కడప: పదవుల కోత విషయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, అలా చేయను కూడా అని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్న ప్రభుత్వ పథకాల వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పథకాలను విమర్శించినందు వల్లనే కోత కోస్తే నన్ను పదవి నుండే తప్పించ వచ్చునని అన్నారు. ఆరోగ్య శాఖలో జరిగిన కొన్ని సంఘటనలకు తాను బాధ్యుడిని కానన్నారు. జూడాల విషయంలో నా వైఫల్యం లేదన్నారు. తనది ముక్కుసూటిగా వ్యవహరించే తత్వమని, ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.

ఉప ఎన్నికల్లో తన ప్రమేయం ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత వహించాలన్నారు. కడప జిల్లాలో ఆధిపత్యం చూపాలనుకుంటున్న వారు ఉప ఎన్నికల్లో మూడు సీట్లు గెలిపించి తమ సత్తా చూపాలని అన్నారు. పదవిలో కోత విధించి భారం తగ్గించినందుకు సిఎంకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తనను కేబినెట్ నుండి తప్పించినా బాధపడనని, సామాన్య కార్యకర్తగా పని చేస్తానని అన్నారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు. కాంగ్రెసు వల్లనే తాను ఉన్నత స్థానానికి వచ్చానని అన్నారు.

English summary
Minister DL Ravindra Reddy fired at CM Kiran Kumar Reddy today for lost out in Monday’s Cabinet expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X