• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వం పని బాగుంది: స్వరం మార్చిన జగన్ ఎమ్మెల్యే

By Srinivas
|

Pilli Subash Chandra Bose
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత ఒకరు తన స్వరం మార్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పించే ఆయన అదే ప్రభుత్వం పొగడ్తల వర్షం కురిపించారు. మాజీ మంత్రి, జగన్ వర్గం తూర్పు గోదావరి జిల్లా నేత పిల్లి సుభాష్ చంద్ర బోసు జిల్లాలో మంగళవారం మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బాగా పని చేస్తుందని కితాబునిచ్చారు. చెన్నారెడ్డి ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వంలోనే ఇరిగేషన్ అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు. ఇరిగేషన్ మంత్రిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.

కాగా జగన్ వర్గం నేతల్లో పిల్లి సుభాష్ చంద్ర బోసు ప్రముఖ నేత కావడం గమనార్హం. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎప్పుడు సమావేశమైనా ఆయన ప్రధానంగా ఉంటారు. ఆయనే మీడియాతో మాట్లాడతారు. నిన్నటి వరకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలా ఈ ప్రభుత్వం పని చేయడం లేదని విమర్శించిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం పని తీరును మెచ్చుకోవడం చర్చనీయాంశమైంది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas Pilli Subash Chandra Bose changes his words on Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X