తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాత్‌రూంలో జారిన సినీ గాయని జానకి, తలకి గాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

S Janaki
చిత్తూరు: ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి ప్రమాదవశాత్తూ జారిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఆమె తిరుపతిలోని భీమాస్ హోటల్‌లో బాత్రూంలో జారి కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో పాటు కాలు కూడా బెనికినట్లు తెలుస్తోంది. ఐదురోజులుగా అన్నమయ్య సంకీర్తనా యజ్ఞంలో పాల్గొన్న జానకికి ఉదయం ప్రమాదం జరిగిందని తెలిసి, అభిమానులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదం జరగగానే హోటల్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె మాట్లాడే పరిస్థితిలోనే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమెకు న్యూరో సర్జరీ చేస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు, అభిమానులు త్వరగా ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మీడియాతో మాట్లాడారు. ఆమె తలకి గాయం కావడంతో ఆరు కుట్లు వేసినట్లు చెప్పారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. బిపి, షుగర్ అదుపులో ఉందని ఆమె అన్నారు.

కాగా జానకి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ తదితర పలు భారతీయ భాషల్లో పాటలు పాడింది. ఈమె నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డులు పొందింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 31 ఫిల్మ్ అవార్డులు పొందింది. ప్రముఖ గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకులు ఇళయరాజాలతో ఈమె కాంబినేషన్‌లో చాలా వచ్చాయి. ఈమెను నైటెంగిల్ ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. ఈమె స్వగ్రామం గుంటూరు జిల్లాలోని రేపల్లె. పదహారేళ్ల వయసు, ఆకలి రాజ్యం, అభిలాష, సితార, చాలెంజ్, సాగర సంగమం, స్వాతి ముత్యం, ప్రేమించు పెళ్లాడు, ఖైదీ నెంబర్ 786, బొబ్బిలి రాజా, కొండవీటి దొంగ, నిర్ణయం, కిల్లర్, ఆలాపన, చిన్నరాయుడు, అంతపురం తదితర చిత్రాల్లో పాటలు పాడింది. ఎస్పి బాలు, రాజ్ కుమార్, పిబి శ్రీనివాస్, ఘంటశార, సుశీల, వాణీ జయరామ్ తదితరులతో కలిసి పాటలు పాడింది.

English summary
Singer S.Janaki fell down in bathroom at Tirupati hotel. She sent to SWIMS hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X