హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్యూటీతో విభేదాల్లేవన్న జగ్గారెడ్డి, బాధ్యతేనన్న గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy-Jagga Reddy
హైదారాబాద్: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రభుత్వ విప్‌గా ఎంపికైన తూర్పు జయప్రకాశ్ రెడ్డి గురువారం అన్నారు. ఇద్దరు సమన్వయంతో ముందుకెళుతున్నారని అన్నారు. దామోదర నుండి వ్యవసాయ శాఖను కావాలని తొలగించారనేది అర్థరహితమన్నారు. దళితుడు అయినందు వల్లే దామోదరకు ఆ పదవి వచ్చిందన్నారు. భవిష్యత్తులో ఆయనకు హోంశాఖ వచ్చినా రావచ్చునని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల్లో ఏమాత్రం బలం లేదన్నారు. తెలంగాణకు నిధులు రాబట్టడంలో టిఆర్ఎస్ విఫలమైందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలుపు ఖాయమన్నారు. ఉద్యమం కారణంగా తెలంగాణ ప్రాంతానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని చీఫ్ విప్‌గా నియమితులైన గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు. మంత్రి పదవి వస్తుందని భావించానని, అయితే ఇది కూడా బాధ్యత కలిగిన పదవేనని అన్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల కారణంగా తనకు పదవి రాలేదన్నారు. సమన్వయంతో హౌస్‌ను నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉంటామన్నారు. ఈ సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చకు ప్రతిపక్షాలు కృషి చేయాలన్నారు. అందరినీ కలుపుకొని పోయి పని చేస్తానని అన్నారు.

ప్రభుత్వానికి శాసనసభకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తానని మరో విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖలో అన్నారు. తన సేవలను గుర్తించి తనకు పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి, కాంగ్రెసు అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Jagga Reddy said that he is no differences with deputy cm Damodara Raja Narasimha. He hoped that Congress will win in bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X