హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు కొత్త అర్థమిచ్చిన గోనె, అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao-Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కొత్త అర్థం చెప్పారు. టిడిపి అంటే టోటల్ డిస్టర్బ్ పార్టీ అని ఆయన శుక్రవారం ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకు ఓటు బ్యాంక్ తగ్గిపోతోందని అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెసు పార్టీ సకల రోగాల పార్టీ అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రులు, ఐఏఎస్‌లు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. కిరణ్, చంద్రబాబు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిదంని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేకే ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉత్సాహంగా విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారన్నారు. ఎనిమిది మందిని ఆర్టీఐ కమిషనర్ల విషయంలోనూ ఆయన స్పందించలేదని ఆరోపించారు.

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మరో నేత గోనె ప్రకాశ్ రావు వేరుగా డిమాండ్ చేశారు. పదవులు గడ్డిపోచతో సమానమన్న డిఎల్ రాజీనామా చేసి వెంటనే సూట్ కేసుల వ్యవహారం బయట పెట్టాలన్నారు. 2004లోనే డిఎల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని అన్నారు. చంద్రబాబు టిడిపిని టోటల్ డిస్టర్బ్ పార్టీగా మార్చారని ఆయన ఆరోపించారు.

English summary
YSR Congress Party leader Gone Prakash Rao gave new meaning to TDP that totally disturb party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X