హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల బెదిరింపులకు లొంగేది లేదని మంత్రి కొండ్రు మురళీ మోహన్ శుక్రవారం అన్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో ఆయన స్పందించారు. వారి బెదిరింపులకు ప్రభుత్వం భయపడదన్నారు. వారి ఆందోళన వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. జూడాల సమ్మె వల్ల కార్పోరేట్ ఆసుపత్రులు లాభపడుతున్నాయన్నారు. వారి వెనుక కొందరి ప్రమేయముందని కొండ్రు మురళి అనుమానం వ్యక్తం చేశారు. జుడాల వైఖరి వల్ల పేదలకు నష్టం జరుగుతోందని, వారి డిమాండ్లు అన్యాయమైనవన్నారు.
కాగా తాము ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు శుక్రవారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజుల తరబడి సమ్మెలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో సాయంత్రం నుండి అత్యవసర సేవలు నిలిపి వేయాలని డాక్టర్ల జెఏసి నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోనున్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి