హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరణించిన వైయస్‌పై విచారణా?: వైయస్ విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మరోసారి లేఖాస్త్రం సంధించారు. ఈసారి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై ఆమె ఈ లేఖాస్త్రం సంధించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు. మరణించిన వ్యక్తిపై విచారణలా అని ఆమె ప్రశ్నించారు. 1994 నుంచి జరిగిన భూకేటాయింపులపై విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. నిర్ణయం తీసుకున్న 11 నెలల తర్వాత సభా సంఘం వేయడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభా సంఘం విధివిధానాల్లో కూడా స్పష్టం లేదని ఆమె అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని కొంత మంది శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాగ్, లోకాయుక్త కూడా తప్పు పట్లలేదని ఆమె గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే వైయస్ ప్రభుత్వ హయాంలోని భూకేటాయింపులపై మాత్రమే సభా సంఘం వేశారని విజయమ్మ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులు, రహేజా, ఓడ చెరువు, ఎమ్మార్, శంషాబాద్ విమానాశ్రయం, ఆరు పవర్ ప్రాజెక్టులు, కాకినాడ సీపోర్టు, విశాఖ ప్రాజెక్టు, ఎంఐజి భారత్ వంటి పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయని ఆమె శనివారం నాదెండ్ల మనోహర్‌కు రాసిన లేఖలో తెలిపారు.

వివిధ కేసుల్లో సిబిఐ ఐఎఎస్ అధికారులను మాత్రమే విచారించడం సరి కాదని, మిగతావారిని కూడా విచారించాలని ఆమె అన్నారు.

English summary
YSR Congress MLA YS Vijayamma has opposed constitution of House committee on land allocations done in YSR regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X