చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ బ్యాంక్ జీతగాడు చంద్రబాబు: ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
శ్రీకాళహస్తి: ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ జీతగాడిగా పనిచేశాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా కాళహిస్తిలో శనివారం ఓ సభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచ బ్యాంక్ ఉచిత కరెంట్ ఇవ్వొద్దని చెప్పిందని, ప్రభుత్వోద్యోగులను తీసేసి కాంట్రాక్టు ఉద్యోగులను పెట్టుకోవాలని చెప్పిందని అనేవారని ఆయన అన్నారు చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అన్ని సార్లు అందరినీ మోసం చేయలేడని, ప్రజలను మోస చేయలేడని, ఏ నాయకులు ఎటువంటి వారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. చంద్రబాబు చెవిలో పువ్వు పెడదామంటే ఎవరూ నమ్మబోరని ఆయన అన్నారు.

చింత చచ్చినా పులుపు చావనట్లు, అధికారం పోయినా చంద్రబాబు తీరు మారలేదని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామంటే కూలీలుగా పంపిస్తున్నారని తాను చేసిన పాపాలను మర్చిపోయి చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే తిరుపతి, శ్రీకాళహస్తిలను కూడా అమ్మేసేవారని ఆయన అన్నారు. అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలోకి రాలేదని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినట్లు చేస్తానని కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి ఓటర్లకు హామీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని బట్టి మన రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందుతోందో అర్థం చేసుకోవచ్చునని ఆయన ఆన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు.

English summary
CM Kiran kumar Reddy alleged that TDP president Chandrababu Naidu has worked as World Bank agent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X