హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి ముందు సీటు ఆరాటం లేదు: వంగా గీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vanga Geetha
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి ముందు సీటు కోసం ఆరాటపడటం లేదని ఆయన వర్గం శాసనసభ్యురాలు వంగా గీత సోమవారం స్పష్టం చేశారు. చిరంజీవి ముందు సీటు కోసం పట్టుబడుతున్నాడన్న వార్తలు అవాస్తవమన్నారు. ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తి అన్నారు. ఆయనపై అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. మా సీట్లు అయినా చిరంజీవి సీటు అయినా ఎక్కడుండాలని నిర్ణయించేది స్పీకర్ నాదెండ్ల మనోహర్ అని చెప్పారు. ఆయన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఇప్పటికే అసెంబ్లీకి సమాచారం అందిందని ఆమె చెప్పారు. స్పీకర్ ఇక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విలీన ప్రక్రియపై బిఏసి సమావేశంలో స్పీకర్ చెప్పారన్నారు. బిఏసి సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నడవాలి, ఏ అంశంపై చర్చ జరగాలనే విషయంపై చర్చించామన్నారు.

మార్చి 29వ తేది వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, 29 రోజులు సమావేశాలు ఉంటాయని, 16 రోజులు సెలవులు ఉంటాయని చెప్పారు. కాగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం పార్టీలు సమావేశాల అజెండా ఖరారు కోసం శాసనసభ బిఏసి సమావేశమైంది. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్ సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ కోరగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.

English summary
Congress MLA Vanga Geetha said that Tirupati MLA Chiranjeevi did not interest about first seat in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X