ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రమణ తెలుసు కానీ ముడుపులు తీసుకోలేదు: రాంరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramreddy Venkat Reddy
ఖమ్మం: మద్యం వ్యాపారి రమణ తనకు తెలిసిన వ్యక్తేనని అయినా తాను కానీ, తన కుటుంబం కానీ ఎలాంటి ముడుపులు తీసుకోలేదని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి ఆదివారం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సాయంత్రం మాట్లాడారు. మద్యం సిండికేట్లకు సంబంధించి ఎసిబి తయారు చేసిన రిమాండ్ రిపోర్టుపై విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు. రిపోర్టుపై పునర్విచారణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరతామన్నారు. ఎసిబి రిమాండ్ రిపోర్టును మంత్రి తీవ్రంగా ఖండించారు. మద్యం వ్యాపారి రమణ డైరీ ఆధారంగా దానిలోని పేర్లతో ఎసిబి రిమాండ్ రిపోర్టు తయారు చేయడం సరికాదన్నారు. రమణ వాంగ్మూలం తీసుకోలేదన్నారు. ఆయన వాంగ్మూలాన్ని బట్టి చర్యలుంటాయని, ఎసిబి తప్పుడు రిపోర్టు ఇచ్చినట్టు తేలితే వారిపైనా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జిల్లా ప్రజా ప్రతినిధులు అభివృద్ధిని కోరుకుటారు తప్ప అవినీతిని కోరుకోరని తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణపై ఆరోపణలు సత్యదూరమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు ముడుపులు తీసుకున్న చరిత్ర లేదన్నారు.

సిపిఎం, సిపిఐ, టిడిపి, న్యూడెమోక్రసి సహా కాంగ్రెసు ప్రజాప్రతినిధులెవరూ ముడుపులు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అనవసరంగా జిల్లాలో ప్రముఖులపై మద్యం వ్యాపారి బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. సత్తుపల్లికి చెందిన టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహా అన్ని పార్టీల్లోని ప్రజాప్రతినిధులకు మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారు. కాగా ఇటీవల ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ రమణ వాంగ్మూలం ఆధారంగా ఎసిబి పలువురు రాజకీయ ప్రముఖులు ముడుపులు తీసుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.

English summary
Minister Ramareddy Venkata Reddy said on sunday that he knew liquor syndicate Ramana, but he did not took money from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X