వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో గిలానీ, నేరారోపణపై సుప్రీంకోర్టుకు హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సోమవారం సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ ఆరోపణపై ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. గిలానీ మెడకు ఎన్‌ఆర్‌వో కుంభకోణం ఉచ్చు బిగిసింది. దీంతో ఆయన పూర్తిగా చిక్కుల్లో పడినట్లే. గిలానీ ప్రధాని పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గిలానీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు ఆరోపించింది. అయితే, తనకు జైలు కొత్త కాదని, జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని గిలానీ అంటున్నారు.

తాజా పరిణామాలతో పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్జారీ స్విట్జర్లాండ్‌కు డబ్బులు తరలించిన కేసును తిరిగి చేపట్టాలని తాము చేసిన ఆదేశాలను గిలానీ ధక్కరించారని ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకార్ చౌధురి నేతృత్వంలోని సుప్రీంకోర్టు విమర్శిస్తూ కోర్టు ధిక్కరణ అభియోగం మోపింది.

గిలానీ స్వయంగా కారు నడుపుతూ సుప్రీంకోర్టుకు వచ్చారు. తన అభిమానుల వైపు చేయి ఊపుతూ ఆయన అభివాదం చేశారు. ఆ తర్వాత కోర్టు గదిలోకి వెళ్లారు. కోర్టులో అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ కూడా ఉన్నారు.

English summary
Pakistan's embattled Prime Minister Yousuf Raza Gilani appeared before Supreme Court on Monday to face contempt charges that could decide his fate and plunge the country into a fresh political turmoil over his refusal to reopen graft cases against the President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X