హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లైంగికంగా వేధిస్తున్నాడని అన్నను కొట్టి చంపిన చెల్లెళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్/మెదక్: హైదరాబాద్ మీర్ పేటలో మంగళవారం దారుణం జరిగింది. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ అన్నను చెల్లెళ్లు దారుణంగా చంపారు. మీర్ పేటలోని సిర్లా కాలనీలో వీరు ఉంటున్నారు. అన్న డిసిఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి 25 ఏళ్ల వయసు ఉంటుంది. సోమవారం రాత్రి అతను మద్యం మత్తులో తన ఇద్దరు చెల్లెళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారు ఆగ్రహించి అతను పడుకున్న అనంతరం పక్కనే ఉన్న రోకలి బండతో అతని తలపై మోదారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న గతంలో కూడా పలుమార్లు మద్యం మత్తులో చెల్లెళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. గతంలోనే అతనిని బంధువులు మందలించారు. అయినా అతను తన వైఖరి మార్చుకోలేదు.

ఇలా నిత్యం మద్యం మత్తులో చెల్లెళ్లు అయిన తమ పట్లనే అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు రాత్రి ఆయనను రోకలితో బాదారు. హత్య చేసిన అనంతరం చెల్లెళ్లు స్వయంగా పోలీసు స్టేషన్ కు వెళ్లి తామే హత్య చేసినట్లుగా చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Two sisters killed brother for harassing them in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X