హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు కౌంటర్: కిరణ్ కుమార్ రెడ్డి కొత్త 'స్కీమ్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరుద్యోగ యువతకు కొత్త పథకాన్ని తీసుకు వచ్చేందుకు రూపకల్పన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిరుద్యోగ యువతను కాంగ్రెసు వైపు ఆకర్షించేందుకు రాజీవ్ యువకిరణాలు పేరుతో ఓ పథకాన్ని తీసుకు వచ్చారు. మరి ఉద్యోగం రాని వారి సంగతేంటి అనే ఆలోచన సిఎం మదిలో మెదిలింది కావచ్చు. నిరుద్యోగులను కూడా కాంగ్రెసు వైపు తిప్పుకునేందుకు కిరణ్ మదిలో కొత్త ఆలోచన తట్టింది. అది నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కల్పించే విధంగా సిఎం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.1000 ప్రభుత్వం తరఫున ఇచ్చేందుకు అధికారులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. నెలకు రూ.వెయ్యి చొప్పున సంవత్సరానికి ఒకేసారి రూ.12వేలు ఒకేసారి ఇచ్చే దిశలో సిఎం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా అధికారులతో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. 2014 ఎన్నికల లోపు నిరుద్యోగ యువతను కూడా కాంగ్రెసు వైపు మళ్లించాలనే లక్ష్యంతో సిఎం ఈ పథకానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు యువత మరలకుండా ఉండేందుకే సిఎం ఈ స్కీమ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

నిరుద్యోగ భృతి పథకం కనుక కల్పిస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.ఐదువేల కోట్ల రూపాయల భారం పడుతుంది. దాదాపు 46 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పటికే అధికారులతో కూలంకషంగా చర్చించారని సమాచారం. గత 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నగదు బదలీ పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఈ పథకాన్ని టిడిపి 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టనుంది. జగన్ వైపు యువత మళ్లకుండా ఉండటంతో పాటు టిడిపి నగదు బదలీ పథకాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి రాజీవ్ యువకిరణాలతో యువతను, నిరుద్యోగ భృతితో నిరుద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మిగిలిన వారి కోసం ఇంకా ఏం పథకాలు తీసుకు వస్తారో చూడాలి.

English summary
CM Kiran Kumar Reddy counter to YSR Congress Party chief YS Jaganmohan Reddy with new scheme to unemployees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X