హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విజయమ్మ, టిడిపి ఎఫెక్ట్: సభా సంఘం రద్దు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nandendla Manohar
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై 15 మంది సభ్యులతో వేసిన సభా సంఘాన్ని రద్దు చేయాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సభా సంఘం ఏర్పాటుపై రాజకీయ దుమారం చెలరేగడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సభా సంఘం విధివిధానాలపై స్పష్టత లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ స్పీకర్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీలకు ఆ సంఘంలో ప్రాతినిధ్యం లేకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా ఇతర పార్టీ నాయకులు కూడా సభా సంఘం సభ్యుల శాతంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సభా సంఘంలో తమ పార్టీకి చెందినవారిని తగినంత మందిని నియమించలేదని చంద్రబాబు విమర్సించారు.


వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడానికే తమ పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని, సభలోని సంఖ్యా బలానికి అనుగుణంగా సంఘంలో ప్రాతినిధ్యం కల్పించలేదని తెలుగుదేశం నాయకులు విమర్సించారు. ఈ స్థితిలో సభా సంఘాన్ని రద్దు చేసి, ఎమ్మెల్సీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ జాయింట్ కమిటీని వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమను అడగకుండా సభా సంఘం వేశారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శను నాదెండ్ల మనోహర్ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో కొట్టిపారేసినట్లు తెలిసింది. సభా సంఘం వేసే ముందు తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్‌ను అడిగానని, కేశవ్ ఇద్దరి పేర్లు చెప్పారని, మిగతా వారి పేర్లు తర్వాత చెబుతానని అన్నారని, కేశవ్ నుంచి పేర్లు రాకపోవడంతో చెప్పినవారి పేర్లతోనే సభా సంఘం వేశానని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.

English summary
It is learnt that Assembly speaker Nandendla Manohar decided to cancel house committee on land allocations of YSR regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X