హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వల్లే తెలంగాణ రాలేదు: రేణుకా చౌదరి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Chowdary
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆ పార్టీపై ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ భ్రష్టు పట్టించారని ఆమె నిందించారు. ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెసిఆర్ డెడ్‌లైన్లు, అల్టిమేటాలు, వినతిపత్రాలు - ఇలా చేసుకుంటూ పోతున్నారని, దానివల్ల ఉపయోగం లేదని, అది కెసిఆర్ ఇష్టమని ఆమె అన్నారు.

తెరాస శాసనసభ్యులు శాసనసభా కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. తెలంగాణపై చర్చించే సత్తా లేకనే తెరాస శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదని, శాసనసభలో ప్రశ్నించాలని, అడ్డుకోవడం సరి కాదని ఆమె అన్నారు. తప్పించుకోవడానికే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. బెదరింపులకు కాంగ్రెసు భయపడదని ఆమె అన్నారు.

సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివరణను కోరిందని, ముఖ్యమంత్రి వివరణ వచ్చిన తర్వాత స్పందిస్తామని ఆమె అన్నారు.

English summary
AICC spokesperson Renuka Chaudhary has blamed TRS president K Chandrasekhar Rao on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X