హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొల్లాపూర్ పీటముడి: డికె అరుణతో చిన్నారెడ్డి ఢీ

By Pratap
|
Google Oneindia TeluguNews

DK Aruna-Chinna Reddy
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ శానససభ నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి ఎంపిక విషయమై పీటముడి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి డికె అరుణ, పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం పాల్గొన్నారు. సమావేశానికి తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి చిన్నారెడ్డి వచ్చారు. ఆయన కొల్లాపూర్ సీటును కోరుతున్నారు.

సమావేశంలో కొల్లాపూర్ సీటుపై చిన్నారెడ్డికి, మంత్రి డికె అరుణకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. సీటు తనకే ఇవ్వాలని చిన్నారెడ్డి పట్టుబట్టగా విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలని అరుణ వాదిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నుంచి కాంగ్రెసులో చేరారు. కొల్లాపూర్ టికెట్ ఇస్తామని కాంగ్రెసులో చేరినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి హామీ ఇచ్చామని అరుణ వాదిస్తున్నారు. అరుణ, చిన్నా రెడ్డి మధ్య నెలకొన్న వివాదంతో కొల్లాపూర్ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెసు నాయకత్వానికి తలకు మించిన వ్యవహారంగానే కనిపిస్తోంది.

కాగా, తెరాస నుంచి జూపల్లి కృష్ణా రావు పోటీ చేయనున్నారు. కాంగ్రెసు పార్టీకి, మంత్రి పదవికి, శాసనసభా సభ్యత్వానికి జూపల్లి కృష్ణా రావు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. డికె అరుణతో కాంగ్రెసులో ఉన్నప్పుడు జూపల్లి కృష్ణా రావు బహిరంగంగానే పోరాటానికి దిగారు. గెలిచే అభ్యర్థులను తాము సమావేశంలో సూచించామని డికె అరుణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొల్లాపూర్‌కు విష్ణువర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూలుకు దామోదర్ రెడ్డి పేర్లను సూచించినట్లు ఆమె తెలిపారు. మహబూబ్ నగర్ సీటుపై ఇంకా నిర్ణయం జరగలేదని ఆమె తెలిపారు. కాగా, చిన్నారెడ్డి బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డిలతో విడిగా సమావేశమయ్యారు.

English summary
War of words tool place between minister DK Aruna and Chinna Reddy on Kolhapur assembly seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X