వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ క్రికెటర్ ఆజహరుద్దీన్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mohammad Azharuddin
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెట్ సారథి మహ్మద్ అజహరుద్దీన్‌కు న్యూఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రీట్ కోర్టు శనివారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణకు పదే పదే గైర్హాజరవుతున్న ఆయనకు జడ్జి విక్రాంత్ వైద్ దీన్ని జారీ చేశారు. ముంబయిలోని అజహరుద్దీన్ ఆస్తి అమ్మకం లావాదేవీల్లో ఆయన తనకిచ్చిన రూ.1.5 కోట్ల చెక్కు చెల్లలేదని సంజయ్ సోలంకి అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించారు. ఈ చెల్లని చెక్కు విషయంలో అజహర్ పలుమార్లు కోర్టుకు హాజరు కాలేదు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండటంతో ఆయన రాలేకున్నారని అజహర్ తరఫు న్యాయవాది పేర్కొనగా దాన్ని కోర్టు తిరస్కరించింది. గడువులో ఆఖరు రోజైన శనివారం ఆయన తప్పక హాజరై ఉండాలని పేర్కొంది.

English summary
A Delhi court on Friday issued a non-bailable warrant against Congress MP and former cricketer Mohammad Azharuddin for his repeated failure to appear before it in connection with a cheque bounce case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X