వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయలక్ష్మికి టిక్కెట్‌పై మ.నగర్ కాంగ్రెస్ నేతల గుర్రు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
మహబూబ్‌నగర్: కాంగ్రెసులో మహబూబ్ నగర్ నియోజకవర్గం మంటలు రాజుకున్నాయి. ఆ స్థానం నుండి పార్టీ తరఫున దివంగత రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి నిలబెట్టాలని కాంగ్రెసు అధిష్టానం దాదాపు నిర్ణయించుకుంది. అయితే జిల్లాకు చెందిన పార్టీ నేతలు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. విజయలక్ష్మికి టిక్కెట్ కేటాయింపుపై పలువురు నేతలు సోమవారం రహస్యంగా భేటీ అయ్యారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో వీరంతా భేటీ అయి ఈ సీటుపై చర్చించినట్లుగా తెలుస్తోంది. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్రంగా ఓ అభ్యర్థిని నిలబెట్టాలని వారు భావిస్తున్నట్లుగా సమాచారం. జిల్లా నేతలు పలువురు మొదటి నుండి విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దివంగత రాజేశ్వర రెడ్డి గత 2009 సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. కాంగ్రెసుకు అనుబంధ సభ్యుడిగా ఉండగానే ఆయన మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ఆయన సతీమణి విజయలక్ష్మికే సీటు కేటాయించేందుకు కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ సెంటిమెంట్ సమయంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సానుభూతి ఓట్లతో ఈ సీటును గెలిపించుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆమెను రంగంలోకి దింపినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని మాత్రం జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. విజయలక్ష్మి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలకే జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ మద్దతు కూడా ఉంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని ఇతరులకు టిక్కెట్ కేటాయించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకొని టిక్కెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Mahaboobnagar district Congress leaders opposing Vijayalaxmi as party MLA candidate from Mahaboobnagar constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X