వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెనజీర్ భుట్టో హత్య వెనక పర్వేజ్ ముషార్రఫ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pervez Musharraf
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ ప్రణాళిక రచించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేయించిన విచారణలో వెల్లడైంది. 2007లో జరిగిన బెనజీర్ దారుణ హత్యపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. బెనజీర్ హత్యకు ఇద్దరు పోలీసు అధికారులను, తెహ్రీక్ - ఎ - తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడు బైతుల్లా మెసూద్‌ను ముషార్రఫ్ వాడుకున్నట్లు విచారణలో తేలిందని తెలుపుతూ వక్త్ టెలివిజన్ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. విచారణ నివేదిక ప్రతి తమ ఉందని ఆ టీవీ చానెల్ చెప్పుకుంది.

బెనజీర్ హత్యపై జరిగిన విచారణ నివేదికను సింధు అసెంబ్లీ ప్రొవిన్షియల్‌కు సమర్పించినట్లు ఆ టీవీ చానెల్ తెలిపింది. బెనజీర్ హత్యకు అకోరా ఖట్టక్‌లో హఖానియా మదర్సాలోని ఓ గదిలో సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, హత్యకు వజీరిస్తాన్‌లో ప్లాట్ రూపుదిద్దుకున్నట్లు, ఆల్ ఖైదా ఆదేశాలను 2007 డిసెంబర్ 27వ తేదీన బైతుల్లా అమలు చేసినట్లు తెలిపింది.

టీవీ చానెల్ కథనం ప్రకారం - బెనజీర్ హత్యలో 16 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు పోలీసులతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. ఆరుగురు మరణించారు. అయితే, ఆ నివేదిక నిర్ధారణలను ముషార్రఫ్‌కు చెందిన ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తోసిపుచ్చింది. బెనజీర్ భుట్టోకి ముషార్రఫ్ తగిన భద్రత ఏర్పాటు చేయలేదని, దీంతో సమస్య తలెత్తిందని నివేదిక తెలిపింది. బెనజీర్ భుట్టో హత్యలో ఎవరెవరు ఏ విధంగా పాల్గొన్నదీ నివేదికలో వివరించారు. ఆ వివరాలను కూడా టీవీ చానెల్ ప్రసారం చేసింది.

English summary
Former Pakistan military ruler Pervez Musharraf orchestrated the assassination of two-time Prime Minister Benazir Bhutto in 2007, a probe ordered by the interior ministry has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X