• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రేణుకా చౌదరి వ్యాఖ్యలపై దామోదర్ రెడ్డి కామెంట్

By Srinivas
|

Damodar Reddy
న్యూఢిల్లీ: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దామోదర రెడ్డి ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరిపై మంగళవారం పరోక్ష విమర్శలు చేశారు. అవకాశవాదంతో తాను పార్టీలు, జెండాలు ఎప్పుడూ మార్చలేదని ఆయన అన్నారు. అవకాశవాదంతో జెండాలు మార్చిన వారు, కాంగ్రెసు పార్టీని తిట్టిన వారే ఇప్పుడు పదవులు అనుభస్తున్నారని విమర్శించారు. ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జోడు పదవుల అంశాన్ని తాను వారి దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని రెండు పదవులు ఉండవద్దని తాను వారిని కోరానన్నారు. ఈ విషయంపై ఆజాద్ సానుకూలత వ్యక్తం చేశారని, ఏప్రిల్‌ తర్వాత నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకొని రాలేదన్నారు. పదవులు అన్నీ సీమాంధ్ర వాళ్లకే ఇవ్వడం చాలా అన్యాయమన్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని తాను పార్టీ నేతలను కోరానని చెప్పారు. పార్టీ పటిష్టత కోసమే తాము పాటుపడుతున్నామని చెప్పారు. తాను ఎప్పుడూ కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. తాను ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానని అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Party senior leader Damodar Reddy commented on AICC spokes person Renuka Chowdary statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more