హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్‌ని, ఆందోళన కలిగింది: సునీల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sunil Reddy
హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ డైరెక్టర్‌గా పనిచేస్తూ సామాన్య జీవితం గడుపుతున్న తనపై సిబిఐ అనవసరమైన ఆరోపణలు చేసిందని ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆయన సిబిఐ తీరును తప్పు పట్టారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనను అరెస్టు చేయడం తనకు ఆందోళనకు గురి చేసిందని ఆయన అన్నారు. విల్లాల అమ్మకాల్లో తమకు ఏ విధమైన ప్రమేయం లేదని ఆయన చెప్పారు.

ఎమ్మార్ విల్లాలకు సంబంధించిన సిబిఐ విచారణలో పూర్తి వివరాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. కోనేరు ప్రసాద్ సలహా మేరకు తాను తుమ్మల రంగారావు వద్ద డబ్బులు తీసుకున్నాననే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు కావాలనే తనపై సిబిఐ తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన విమర్శించారు. అరెస్టు సమయంలో తన ఇంటిలో జరిపిన సోదాల్లో సిబిఐకి ఏ విధమైన ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు. తుమ్మల రంగారావుకు ఇచ్చినట్లే తనకు కూడా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై బుధవారం సిబిఐ కౌంటర్ దాఖలు చేయనుంది.

English summary
Sunil Reddy arrested in EMAAR properties case filed bail petition in CBI court,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X