హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: సిబిఐ కస్టడీ పిటిషన్ కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi-Rajagopal
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం వారిద్దరిని తమకు అప్పగించాలని కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టత లేదంటూ వారి విచారణకు కోర్టు నిరాకరించింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో లీజుల విషయంలో రాజగోపాల్‌ను, శ్రీలక్ష్మిని విచారించాల్సిన అవసరం ఉందని, వారి విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సిబిఐ తన పిటిషన్‌లో తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నిందితులైన ఆ ఇద్దరు అధికారుల పాత్ర వైయస్ జగన్ ఆస్తుల కేసులోనూ ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ అభిప్రాయపడింది.

ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ అస్పష్టంగా ఉన్న మెమోపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అస్పష్టంగా ఉన్న మెమో ఆధారంగా దాఖలైన కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

English summary
Nampally court rejected CBI petition filed seeking custody of Srilakshmi and Rajagopal in YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X