హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: 7 గంటలపాటు నిమ్మగడ్డ ప్రసాద్ విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను బుధవారం విచారించారు. సుమారు ఏడుగంటల పాటు సిబిఐ అతనిని విచారించింది. జగన్ కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి లాప్ టాప్ అప్పగించాలన్న సువర్ణ భూమి పిటిషన్ పైన విచారణను కోర్టు 24వ తేదికి వాయిదా వేసింది.

ఓబుళాపురం గనుల కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌లకు బుధవారంతో రిమాండ్ ముగిసింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు వారిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. మార్చి 7వ తేది వరకు వారి రిమాండును పొడిగించింది. తమ కార్లు, హెలికాప్టర్లు తిరిగి అప్పగించాలన్న గాలి, శ్రీనివాస్ రెడ్డి పిటిషన్లపై విచారణను కోర్టు 28వ తేదికి వాయిదా వేసింది. ఓఎంసి కేసులోనే అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రిమాండును కూడా కోర్టు మార్చి ఏడవ తేది వరకు పొడిగించింది. ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్య, సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, విజయ రాఘవన్‌ల రిమాండ్ కోర్టు రెండు వారాలు పొడిగించింది.

English summary
CBI special court extended Gali Janardhan Reddy and Srinivas Reddy remand for fifteen days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X