హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై ముత్యం రెడ్డి, టిడిపి లింగా రెడ్డిపై సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Muthyam Reddy-Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి చేసిన వ్యాఖ్యలు, టిడిపి ఎమ్మెల్యే లింగా రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. సభలో ముత్యం రెడ్డి మాట్లాడుతూ... అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఆదర్శ రైతులను నియమించడం పొరపాటు అన్నారు. ప్రజలు కొత్తవారి వైపు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. నాలాంటి పిచ్చోడిలా మాట్లాడారని బాబును ఉద్దేశించి అన్నారు. ఆయన వ్యాఖ్యలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు ముత్యం రెడ్డి తాను బాబును పిచ్చోడని అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. దీంతో సభ సద్దుమణిగింది.

ఆ తర్వాత సిఎం కిరణ్ మాట్లాడుతుండగా టిడిపి నేతలు పలుమార్లు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నాలు చేశారు. లింగా రెడ్డి నిలబడి కిరణ్ ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహోద్రుడైన కిరణ్ హోప్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. దీనికి టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఏదైనా అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.

కాగా ఆ తర్వాత చంద్రబాబు సభలో మాట్లాడారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు. రాష్ట్రంలోని గోదాములన్నింటిని నిర్మించింది టిడిపియేనన్నారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ డిస్కంలకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. వాస్తవాలు కఠోరంగా ఉంటాయని కాంగ్రెసు వారు కాస్త ఓపిగ్గా వినాలన్నారు. మేం ప్రవేశ పెట్టిన ఈ-సేవను మీరు మీ-సేవగా మార్చారన్నారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేసిన టిడిపి, సిపిఐ సభ నుండి వాకౌట్ చేశాయి. శాసనసభ గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించింది.

English summary
Congress MLA Muthyam Reddy commented TDP chief Nara Chandrababu Naidu and CM Kiran Kumar Reddy blamed TDP MLA Linga Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X