హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెసి, జానా భేటీ: తెలంగాణను పరిష్కరిస్తామని వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట రెడ్డి, రాంరెడ్డి దామోదర రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడేందుకు ఏం చేయాలో చర్చించేందుకు వారు భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు శాశ్వత పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. చాలా రోజుల తర్వాత పార్టీ సీనియర్లం భేటీ అయ్యామని అన్నారు. అధిష్టానానికి మేమే తెలంగాణపై పరిష్కారం చూపించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ అంశంపై మేము సంపూర్ణంగా చర్చించిన తర్వాత మిగతా వారితో చర్చిస్తామని, పార్టీలో అసంతృప్తులు నిజమేనని, తెలంగాణకు రెండేళ్లు సీమాంధ్రకు మూడేళ్లు సిఎం పదవి అని గతంలో జెసి చెప్పారని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. కాగా జెసి, గాదె, దామోదర రెడ్డి, జానా భేటీ చర్చనీయాంశమైంది.

త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రధాన అంశంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రెండు ప్రాంతాలలో పార్టీ నష్టపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. తెలంగాణకు పరిష్కారం, పార్టీ పటిష్టతపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా వారు భావిస్తున్నారు.

English summary
Congress Party senior leaders JC Diwakar Reddy, Ramreddy Damodar Reddy, Jana Reddy and Gade Venkat Reddy met today at Assembly premices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X