హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీ పేలుడు, 4కి.మీ. వినిపించిన శబ్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గురువారం భారీ పేలుడు సంభవించింది. మియాపూర్‌లోని వీడియో కాలనీలోని ఓ చెత్తకుప్పలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు కారణంగా పక్కనున్న అపార్టుమెంటువాసులు వెంటనే ఇళ్లలో నుండి బయటకు వచ్చారు. మూడు నాలుగు ఆపార్టుమెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చారు.

చెత్తకుప్పలోని జిలెటిన్ స్టిక్స్ వల్ల ఈ పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బాంబు స్క్వాడ్‌తో ఇంకా ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అక్కడి పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు మంటలను ఆర్పివేశారు.

English summary
Bomb Blast took place at Miyapur of Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X