దేవినేని నెహ్రూ వర్సెస్ మల్లాది విష్ణు, మీటింగ్ రసాభాస

Malladi Vishu and Devineni Nehru
విజయవాడ: కాంగ్రెసు పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. నగరంలోని ఆంధ్ర రత్న భవనంలో శనివారం కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, శాసనసభ్యుడు మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో దేవినేని నెహ్రూ మాట్లాడుతూ.. పార్టీలో కొందరు కార్యకర్తలను, నేతలను కలుపుకొని వెళ్లడం లేదని మల్లాది విష్ణును ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది.

కాగా మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణపై గెలుపొందారు. ఈ నియోజకవర్గం 2009 ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మొట్టమొదటి ఎమ్మెల్యే విష్ణు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+