వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాక్‌డ్రిల్‌:3వ అంతస్తువద్ద తాడు తెగి యువతి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అగ్నిమాపక విన్యాసాలు ఓ యువతి మృతికి దారి తీసిన సంఘటన శుక్రవారం బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునే మార్గాల గురించి అవగాహన విన్యాసాలు నిర్వహించారు. ఈ సమయంలో నళిని అనే కార్మికురాలు భవనం మూడో అంతస్తు పై నుంచి పడి చనిపోయింది. నళిని వయస్సు 25 ఏళ్లు. బాంబై రేయాన్ గార్మెంట్స్ పరిశ్రమలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా దించాలనే విన్యాసాలను ప్రదర్శింప చేసేందుకు సిద్ధమయ్యారు. నళినిని అనే కార్మికురాలని ఇందుకు ఎంపిక చేసుకున్నారు.

నళినికి తాడు కట్టి నాలుగో అంతస్తు పై నుంచి కిందకు దింపే సమయంలో మూడో అంతస్తు వద్దకు రాగానే తాడు తెగి ఆమె కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇలాంటి ప్రదర్శన సమయంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగ్నిమాపక అధికారులు తీసుకోలేదు. అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. కింద వలలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని చేయలేదు. నళిని పని చేసే కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A mock fire drill on Friday morning turned fatal for a 23-year-old woman. The drill, conducted by the fire and emergency services department, mocked every aspect of safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X