వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి డికె అరుణ దౌత్యం: వెనక్కి తగ్గిన విజయలక్ష్మి

By Pratap
|
Google Oneindia TeluguNews

DK Aruna
మహబూబ్‌నగర్: ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడిన దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి భార్య విజయలక్ష్మితో జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ జరిపిన మంత్రాంగం ఫలించింది. కాంగ్రెసు టికెట్ ఆశించి విజయలక్ష్మి భంగపడ్డారు. దీంతో ఆమె మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నచ్చజెప్పినా ఆమె వినలేదు. దీంతో డికె అరుణ ఆదివారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి మాట్లాడారు.

డికె అరుణ, జిల్లా కాంగ్రెసు నాయకులతో కలిసి విజయలక్ష్మి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని ఆమె కోరారు. అందుకు కాంగ్రెసు నాయకత్వం తగిన స్థానం కల్పిస్తుందని ఆమె చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని విజయలక్ష్మి మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజేశ్వర రెడ్డి అనుచరులకు ఏ విధమైన అన్యాయం జరగదని, విజయలక్ష్మికి పార్టీ తగిన స్థానం కల్పిస్తుందని డికె అరుణ చెప్పారు.

English summary
Minister DK Aruna succeeded in convincing Vijayalakshmi on Mahaboobnagar assembly seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X