రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్య స్పీకర్‌దే: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
రాజమండ్రి/ ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలు తీసుకోవాల్సింది స్పీకరేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. వారిపై పార్టీపరంగా ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ప్రస్తుతం ఆ అంశం స్పీకర్ పరిధిలో ఉందని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ షో నిర్వహించడానికి బయలుదేరే ముందు ఆయ రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికారం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏడు రోజుల సమావేశాల్లో ఏం చేశారని ఆయన అడిగారు.

చంద్రబాబుకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేదని, ప్రజా సమస్యలకన్నా వ్యక్తిగత ఆరోపణలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. డిసిసి నియామకాల్లో మార్పులు చేయాల్సి వస్తే చేస్తామని, లేదంటే పాతవారినే కొనసాగిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు బి - ఫారాలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి ప్రచారం సాగిస్తామని ఆయన చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయనకు కార్యకర్తలు ఒంటెలతో స్వాగతం పలికారు. పోలవరం మండలంలో రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు. పోలవరం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రానున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేస్తారని ఆయన అన్నారు. చంద్రబాబును నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. తాము శానససభలో పేదల బడ్టెట్‌ను ప్రతిపాదించామని, రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు.

English summary
PCC President Botsa Satyanarayana said that Speaker has to take action against YSR Congress president YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X