వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాల్లోకి కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ తనయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajith Antony
కొచ్చిన్: రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అజిత్ అంటోనీ సినీ రంగం ప్రవేశం చేస్తున్నారు. ఓబెరాయ్ చిత్రంతో ఆయన సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మాణవుతోంది. అజి జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళం వెర్షన్ సినిమాకు స్క్రిప్టు సిద్ధమైనట్లు అజి జాన్ చెప్పారు. మలయాళం, తమిళ వెర్షన్ల షూటింగ్ ఒకేసారి జరపాలని అనుకుంటున్నట్లు జాన్ చెప్పారు.

22 ఏళ్ల అజిత్ ఆంటోనీ చిన్న కుమారుడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆయన ఆంగ్ల సాహిత్యం చదివారు. మలయాళం వెర్షన్ సినిమా సంభాషణలను అనూప్ మీనన్ రాశారు. కథను అజితే రాశాడు. దాంతో ఫొటో సెషన్ గోవాలో జరిగింది. వ్యాపారంలో ప్రత్యర్థులైన ఇద్దరు ఉత్తర భారత వ్యాపారులకు సంబంధించన కథ ఇది. అజిత్ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని జాన్ చెబుతున్నాడు.

English summary
Ajith Antony, son of Defense Minister AK Antony, has decided to try his luck in showbiz and his debut film Oberoi will go on the floors in August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X