హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే చిన్నం, పోలీస్ వాహనం ఢీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో సోమవారం చిన్న ప్రమాదం జరిగింది. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య శాసనసభ సమావేశాల కోసం ఉదయం అసెంబ్లీకి వచ్చారు. ఆయన కారు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చాకు ఓ పోలీసు వాహనం ఆయన కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామకోటయ్య వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎమ్మెల్యే రామకోటయ్య ఈ విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

కాగా వాయిదా పడిన అనంతరం సభ రెండోసారి ప్రారంభమైంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మద్యం సిండికేట్లపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రెండోసారి కూడా అరగంట పాటు వాయిదా వేశారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ పది నిమిషాలు కూడా నడవకుండానే రెండు పర్యాయాలు అర్దగంట చొప్పున వాయిదా పడింది.

English summary
A police vehicle and MLA vehicle collided at Assembly premises today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X