వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలు రేపిస్టులు, హంతకులు: అర్వింద్ కేజ్రీవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
న్యూఢిల్లీ: అన్నా టీమ్ సభ్యుడు అర్వింద్ కేజ్రీవాల్ వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. దేశ పార్లమెంట్‌కు ఎన్నికైన మన ప్రజా ప్రతినిధులు రేపిస్టులు, దోపిడీదారులు, హంతకులు ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ ప్రజా చైతన్య కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్‌లో అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్న దోపిడీ దారులు, రేపిస్టులు, హంతకులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఘోరమైన నేరాల కింద 163 మంది సభ్యులపై కేసులున్నాయని ఆయన చెప్పారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి లూలా ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ మండిపడింది. కెజ్రీవాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పార్లమెంట్‌కే అవమానమని అన్ని పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆయనకు పార్లమెంట్‌పైనా, రాజ్యాంగం పట్ల ఎలాంటి విశ్వాసం లేదని చెప్పడానికి పరుష వ్యాఖ్యలే నిదర్శనమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్‌పై పార్లమెంట్‌లో హక్కుల తీర్మానం తీసుకొస్తామని ఆర్జేడీ ప్రకటించింది.

అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కేజ్రీవాల్‌పై మండిపడింది. ఇలాంటి మాటలు పార్లమెంట్‌కు, చట్టసభ సభ్యుల్ని ఎన్నుకునే ప్రజలకూ అవమానమని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కెజ్రీవాల్ మాట్లాడారని, ఇది ఆయన దురహంకారానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ విమర్శించింది.

English summary
Team Anna member Arvind Kejriwal has courted a fresh controversy by saying that "rapists, murderers and looters" were sitting in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X