హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ వాదన తెచ్చేందుకే కొవ్వూరులో కెసిఆర్ పోటీ: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తన వ్యూహంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడుతున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. కొవ్వూరులో టిఆర్ఎస్ కు ఓట్లు రాకపోతే అక్కడ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఓట్లు వేయనప్పుడు తెలంగాణలో మాత్రం ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలని అనే వాదన తెరపైకి తెచ్చేందుకే ఆయన ఈ వ్యూహం పన్నారని బొత్స అభిప్రాయపడ్డారు. సాయంత్రం బొత్స కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల అభ్యర్థులకు బి ఫారాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేసి విజయం సాధించాలని అన్నారు.

ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విష్ణువర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), దామోదర్‌రెడ్డి(నాగర్‌కర్నూలు), రామచంద్రారెడ్డి(ఆదిలాబాద్), రాజిరెడ్డి (కామారెడ్డి)లకు పార్టీ బీ ఫారా లను గాంధీభవన్‌లో సోమవారం బొత్స అందజేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెసు అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేది తెచ్చేది జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే అనే నినాదంతో ఉప ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ విజయం ఖాయమని వారు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్న వారంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కాదని వారిని ప్రజలు నమ్మడం లేదన్నారు.

English summary
PCC chief Botsa Satyanarana said that TRS contest from Kovur is party chief K Chandrasekhar Rao's strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X